JIO bumper offer | జియో బంపరాఫర్.. పదో తరగతి, ఇంటర్ అర్హతోనూ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..!
JIO bumper offer | టెలికామ్ రంగంలో జియో సంస్థ సంచలనాలకు మారుపేరుగా మారింది. అంబానీ దెబ్బకు అప్పటి వరకు దూసుకుపోతున్న మిగతా టెలికామ్ కంపెనీలు కుదేలయ్యాయి. జియోతో పోటీని తట్టుకోవడానికి అవి కూడా రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను తగ్గించాల్సి వస్తుంది. అయితే ఈ నెల నుంచి జియో సహా మిగతా టెలికామ్ కంపెనీలు.. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 4 నుంచే అమల్లోకి వచ్చాయి.

JIO bumper offer : టెలికామ్ రంగంలో జియో సంస్థ సంచలనాలకు మారుపేరుగా మారింది. అంబానీ దెబ్బకు అప్పటి వరకు దూసుకుపోతున్న మిగతా టెలికామ్ కంపెనీలు కుదేలయ్యాయి. జియోతో పోటీని తట్టుకోవడానికి అవి కూడా రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను తగ్గించాల్సి వస్తుంది. అయితే ఈ నెల నుంచి జియో సహా మిగతా టెలికామ్ కంపెనీలు.. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 4 నుంచే అమల్లోకి వచ్చాయి.
ఈ సంగతిని పక్కన పెడితే జియో నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 30 వేల ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. వీటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మీరు కూడా పదో తరగతి, ఇంటర్ పాసై జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు జియో బంపరాఫర్ ప్రకటించింది.
వివిధ విభాగాలలో దాదాపుగా 30 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. డిగ్రీ, పీజీతోపాటు పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి కూడా ఉద్యోగాలు కల్పించనుంది. అంతేకాక వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్ కావాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు వారి క్వాలిఫికేషన్‌కు తగ్గ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జియో సూచించింది.
ఈ ఉద్యోగాల కోసం జియో అధికారిక వెబ్సైట్‌లో మీ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆ తర్వాత కంపెనీవారు దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఫోన్, మెయిల్ ద్వారా సంప్రదిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు జియో ప్లాన్ చేసింది.
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ ఆపరేషన్స్ , ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అప్రెంటిస్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, హోమ్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కార్పొరేట్ ఎఫైర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేటరీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్, ఆపరేషన్స్, సప్లై చైన్ కార్పొరేట్ సర్వీసెస్, లీగల్ మార్కెటింగ్‌తోపాటు ఇతర విభాగాల్లో సుమారు 30 వేల వరకు ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లమా, బిటెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్
పోస్టింగ్ లొకేషన్ : మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు
చివరి తేదీ : ఇంకా ప్రకటించలేదు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం
గమనిక : జియో అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.