TS Engineering Fees : ఈ ఏడాది తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలల్లో పాతఫీజులే!
ఈ ఏడాది తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే అమల్లోకి. కొత్త ఫీజుల ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
TS Engineering Fees | విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల విషయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచేది లేదని, పాత ఫీజులే కొనసాగుతాయని తెలిపింది. కొత్త ఫీజుల కోసం ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయంటూ.. ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యా కళాశాలలకు హేతుబద్ధమైన ఫీజులను నిర్ణయించేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని, ఇప్పటి కాలానికి అనుగుణంగా కొలమానాలను రూపొందిస్తామని కమిటీ ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను కూడా పెంచింది. ప్రారంభంలో 1,07,444 సీట్లు ఉండగా, ఇప్పుడు 9,433 సీట్లు అదనంగా పెరిగి, మొత్తం సీట్లు 1,16,877 కు చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి…Nizamabad : పది రూపాయలకే ప్యాంట్-షర్ట్ ఆఫర్ కోసం ఎగబడ్డ జనం..యజమాని అరెస్టు!
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 240 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram