రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు.ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి.

సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఫలితాల విడుదలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపు ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసుకుంది. విద్యార్థులు bse.telangana.gov.in, results.cgg.gov.in, manabadi.co.in వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వాట్సాప్ 8096958096 నంబర్‌కు “Hi” అని పంపండం ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

వాస్తవానికి పదవ తరగతి ఫలితాలను ముందుగా మే మొదటి వారంలో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఏప్రిల్ 29 రిలీజ్చేయనున్నట్లుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

గూగుల్‌ డేటా సెంటర్.. ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు
అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Latest News