విద్యార్థులకు అలర్ట్..తెలంగాణ ఈఏపీ సెట్..పీజీ ఈసీఈటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ టీజీ ఈఏపీసెట్, పీజీ ఈసీఈటీ, ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల షెడ్యూల్ విడుదలైంది. జేఎన్‌టీయుహెచ్ (JNTUH)లో జరిగిన మొదటి సీఈటీ (CET) కమిటీ షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్(TG EAPECT) అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఫిబ్రవరి 19నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరిస్తారు. ఎలాంటి ఆలస్య రుసం లేకుండా దరఖాస్తులకు ఏప్రిల్ 4వ చివరి తేదీగా నిర్ణయించారు.
టీజీ ఈఏపీసెట్ ఎంట్రన్స్ పరీక్షలను అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు మే 4,5తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విద్యార్ధులకు మే 9నుంచి మే 11వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
పీజీ ఈసీఈటీ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీజీ ఈసీఈటీ -2026 ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదలైంది. TG ECET అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న వెలువడుతుంది. ఫిబ్రవరి 27నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 6వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.
12నుంచి తెలంగాణ ఐసెట్ దరఖాస్తులు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 6న విడుదల కానున్నది. ఈ క్రమంలో బుధవారం మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 16వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
23నుంచి టీజీ ఎడ్ సెట్ దరఖాస్తులు
రెండేండ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చే నెల 20న విడుదల కానున్నది. అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Medaram Jatara : అడవి ఉప్పొంగిన వేళ అమ్మ దేవతల దర్శనం
Liu Chuxi | 55 రోజులుగా కోమాలో విద్యార్థి.. ప్రాణం పోసిన స్నేహితుల వీడియో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram