akhanda-2 | ఆఖండ 2 సినిమా నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం

అఖండ 2 సినిమా నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఖండ 2 ప్రీమియం షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా పెంచిన ధరలకు టికెట్లు విక్రయించడంపై సింగిల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

akhanda-2 | ఆఖండ 2 సినిమా నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం

విధాత, హైదరాబాద్ : అఖండ (2akhanda-2) సినిమా నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా..మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదంటూ మండిపడింది. ఆఖండ 2 ప్రీమియం షో టికెట్ల ధరల పెంపు(ticket price hike) జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా పెంచిన ధరలకు టికెట్లు విక్రయించడంపై సింగిల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం ఆదేశాలు ఇచ్చాక మీరు పెంచిన ధరల మేరకు టికెట్లు విక్రయించారని..కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. పెంచిన ధరల మేరకు టికెట్లు ఆన్ లైన్ లో ఎందుకు విక్రయిస్తున్నారని బుక్ మై షో ను ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో ప్రశ్నించింది. ఇప్పుడు పెంచిన ధరలతోనే ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారా లేదా మీపై ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో చెప్పడంటూ నిలదీసింది. విచారణ కొనసాగిస్తుంది.

డివిజన్ బెంచ్ లో అప్పీల్

ఆఖండ 2 సినిమా పెంచిన టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాతలైన 14రీల్స్ సంస్థ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ పిటీషన్ పై మధ్యాహ్న 2:30 కు విచారణ చేస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది. దీంతో అఖండ 2 సినిమా టికెట్ల వ్యవహారం మరింత ఆసక్తి కరంగా మారింది.