Pawan Kalyan| ఇది ఆరంభం మాత్రమే అంటూ పవన్ కళ్యాణ్ వీడియోపై అనసూయ క్రేజీ కామెంట్
Pawan Kalyan| అందాల భామ అనసూయ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాంట్రవర్సీలు పుట్టించే విధంగా ట్వీట్స్ చేస్తూ కొత్త వివాదాలకి తెరలేపుతూ ఉంటుంది. అప్పట్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో అనసూయ ట్వీట్ వార్ ఎన్ని రోజులు సాగిం
Pawan Kalyan| అందాల భామ అనసూయ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాంట్రవర్సీలు పుట్టించే విధంగా ట్వీట్స్ చేస్తూ కొత్త వివాదాలకి తెరలేపుతూ ఉంటుంది. అప్పట్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో అనసూయ ట్వీట్ వార్ ఎన్ని రోజులు సాగిందో మనం చూశాం. ఆ తర్వాత అనసూయనే సైలెంట్ అయింది.ఇక అనసూయ సామాజిక స్పృహ ఉన్న మహిళ కావడంతో సమాజంలో మహిళలకు సంబంధించిన విషయాల గురించి వెంటనే స్పందిస్తూ ఉంటుంది. అనసూయ సోషల్ మీడియా పోస్ట్‌లు క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక అనసూయ పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ తన పనేదో తాను చూసుకుంటుంది. కాని సడెన్ గా అనసూయ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది కూడా సరైన టైంలో స్పందించడం విశేషం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడానికి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకి నమస్కారం చేశారు. ఇక ఆ సమయంలో మెగా కుటుంబ సభ్యులు రాంచరణ్ ఉపాసన, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, చిరంజీవి సురేఖ దంపతులు, అక్క చెలెళ్ళు అందరు ఉండి పవన్‌కి ఘన స్వాగతం పలికారు.
మంగళహారతులతో పవన్‌కి మెగా ఫ్యామిలీ అద్భుతమైన ఆహ్వానం పలికింది. ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి, సురేఖ, తన తల్లి అంజనా దేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక కేక్ కూడా కట్ చేశాయి. చిరు ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి మెగా అభిమాని ఎమోషనల్ అయ్యేలా అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు వెల్లివిరిసాయి. ఇది చూసిన అనసూయ తన సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్ చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాయకుడు వచ్చాడు.. పవర్ లో పవర్ స్టార్ అంటూ అనసూయ పోస్ట్ చేయగా, ఆమె స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇది నిజమైన ప్రేమ అంటూ చిరంజీవి, పవన్ మధ్య అనుబంధం గురించి అనసూయ అద్భుతంగా స్పందించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram