IND vs SA : విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు

విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీ (106) చేయడంతో సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది.

IND vs SA : విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు

విధాత : విశాఖ వేదికగా భారత్ తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు భారత్ కు 271పరుగుల లక్ష్యాన్ని విధించింది. 20వన్డేల తర్వాత తొలిసారిగా టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫిల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 1పరుగుకే ఓపెనర్ రికిల్టన్(0) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ సెంచరీ(106)తో దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. 47.5ఓవర్లలో సఫారీ జట్టు 270పరుగులకు అలౌటైంది.

ఓపెనర్ డికాక్ 106(89బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు)తో రాణించాడు. కెప్టెన్ బవుమాతో కలిసి రెండో వికెట్ కు 113పరుగులు జోడించాడు. అనంతరం బవుమా 48(67బంతుల్లో 5ఫోర్లు) పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. డికాక్ 32.5ఓవర్ లో జట్టు స్కోర్ 199పరుగుల వద్ద ఐదో వికెట్ గా వెనుతిరిగాడు. ఈ క్రమంలో బ్రిట్జ్ 24, మార్ క్రమ్ 1, బ్రెవిస్ 29, యన్సెన్ 17, బోచ్ 9, ఎంగిడీ 1, బార్ట్ మెన్ 3పరుగులకు అవుటయ్యారు. కేశవ్ మహారాజ్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్షదీప్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు. తిలక వర్మ మూడు ఓవర్లు వేసి 29పరుగులు సమర్పించుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

Heliconia | మోదీ–పుతిన్ భేటీలో అందరినీ తనవైపుకు తిప్పుకున్న మొక్క
Revanth Reddy : వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి