అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ షురూ…తొలి షాట్ తోనే ఫన్నీ ప్రమోషన్

వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. తొలి షాట్‌తోనే ఫన్నీ ప్రమోషన్ చేసి చిత్రబృందం ఆకట్టుకుంది.

సీనియర్ నటుడు, విక్టరి వెంకటేష్, దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న VenkyAnil5 – NKRAR2 సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా.. సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. దిల్‌ రాజు స్క్రిప్ట్‌ అందించి టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

తొలి షాట్ తోనే ..ఫన్నీ ప్రమోషన్

వెంకటేష్, కృతి శెట్టి, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ లపై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్.. ఈ చిత్రం రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్టా షాట్ లో మొదట వెంకటేష్ పక్కన కృతిశెట్టి, కళ్యాణ్ రామ్ పక్కన కీర్తి సురేష్ నిలబడతారు. ఇక ఆ తర్వాత హీరోలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. వెంటనే ఇద్దరు హీరోయిన్లు తమ ప్లేస్‌లను మార్చుకుని.. వెంకీ పక్కన కీర్తి, కళ్యాణ్ రామ్ పక్కన కృతిశెట్టి వచ్చి నిలబడినట్లుగా తొలి షాట్ ను చిత్రీకరించి అనిల్ రావిపూడి తనదైన డిఫరెంట్ మేకింగ్ తో మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాతికి విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నారు.

టాలీవుడ్ వరుసగా వెంకటేశ్ తో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తీసి సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి దగ్గుబాటి, నందమూరి నటులతో మల్టీ స్టార్ కామెడీ అండ్ యాక్షన్ సినిమాతో మరెన్ని కోట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేశ్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం:47’ అనే సినిమా చేస్తున్నారు.

Latest News