Coolie | కూలీ సినిమా టికెట్ల కోసం కేరళలో అభిమానుల పరుగులు
రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ల కోసం కేరళలో అభిమానుల క్యూ! తొలి రోజే 3.5 కోట్ల టికెట్లు అమ్ముడవ్వడం సంచలనం సృష్టించింది.
Coolie | విధాత : సీనియర్ హీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని నెగెటివ్ రోల్లో కనిపించనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్లో , కన్నడ హీరో ఉపేంద్ర తమ పాత్రలతో అలరించబోతున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. లొకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా టికెట్ల బుకింగ్ సాగుతుంది.
ఆగస్టు 14వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కేరళాలలో ప్రారంభమైన ఫ్రీ సెల్స్ తొలి రోజు 3.5కోట్ల టికెట్లు అమ్ముడై సంచలనం కల్గించింది. తొలి రోజు మొత్తంగా రూ.100కోట్ల మార్కు సాధిస్తుందని అంచనా.. వార్-2 సినిమా నుంచి కూలీకి గట్టి పోటీ ఎదురువుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram