హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న క్రేజీ కళ్యాణం మూవీ టీజర్ విడుదలైంది. తెలంగాణా నేపధ్యంలో సాగనున్న వినోదాత్మక కథతో బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.క్రేజీ కళ్యాణం మూవీలో అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ అమ్మాయిగా యాస భాషతో ఆకట్టుకుంది.
‘చెప్పు తల్లి… ఎలా చేయాలి నీ పెళ్లి? ఎంత బంగారం కావాలి? ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో… జోరుగా చేస్తా నీ పెళ్లి’ అంటూ నరేష్ చెప్పే భావోద్వేగ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఏం ఫ్యామిలీ రా నాయనా..బ్రతకనివ్వరు.. చావనివ్వరు! అంటూ తరుణ్ భాస్కర్ డైలాగ్.. చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా గొడవలు, పెళ్లి సందడి, అనుకోని ట్విస్టులతో టీజర్ సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఆధ్యంతం హాస్యభరిత వినోద సన్నివేశాలతో సాగిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమనిపిస్తోంది. టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. ఫుల్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్రేజీ కళ్యాణం’ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను కూడా అలరించే పూర్తి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్ ను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు.
#CrazyKalyanam Teaser
నీ పెళ్లి జోరుగా చేస్తాను బిడ్డా…
అనుపుమ : O My Godoooooo#TharunBhascker #AnupamaParameswaran pic.twitter.com/ic0yYOPSlI
— TeluguOne (@Theteluguone) August 1, 2026
