Junior- Viral Vayyari Video Song | ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల
‘జూనియర్’ సినిమాలో యువతను ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ పాట ఫుల్ వీడియో విడుదలైంది. కిరీటి-శ్రీలీలల డాన్స్ స్టెప్పులకు యూట్యూబ్ లో ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ బీట్స్‌కు ఎనర్జిటిక్ కెమిస్ట్రీతో మాస్‌ను ఆకట్టుకుంటోంది.
Junior- Viral Vayyari Video Song | విధాత : గాలి కిరీటి, శ్రీలీల జంటగా నటించిన ‘జూనియర్’ సినిమాలో ‘వైరల్ వయ్యారి’ సాంగ్ యూత్ ను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరేజ్ గా ఆడినప్పటికి ‘వైరల్ వయ్యారి’ పాటలో కిరిటి శ్రీలీల డాన్స్ స్టెప్పులు యువతతో పాటు మాస్ ను బాగా ఆకట్టుకున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్‌కు కిరీటి, శ్రీలీల ఇద్దరూ మంచి రోమాంటిక్ కెమిస్ట్రీతో ఎనర్జిటిక్ స్టెప్పులతో పోటాపోటీ డాన్స్ తో ఆడియాన్స్ ను అలరించారు. ఇప్పుడీ ‘వైరల్ వయ్యారి’ పాట ఫుల్ వీడియోను టీమ్ విడుదల చేసింది. దీంతో యూ ట్యూబ్ లో మరిన్ని వ్యూస్ సొంతం చేసుకునే దిశగ ‘వైరల్ వయ్యారి’ దూసుకపోతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram