వరుణ్ తేజ్, రితిక నాయక్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ మూవీ నుంచి మేకర్స్ శనివారం ట్రైలర్ ను విడుదల చేశారు. హీరో రామ్ చరణ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ట్రైలర్ లో చూస్తే కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్, కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. మూవీలో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలలో నటించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో సత్య కామెడీ టైమింగ్, యాక్టింగ్ హైలెట్ గా ఉంది. హారర్ షాట్స్, మిస్టరీ ఎలిమెంట్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి థియేటర్లలో మంచి అనుభూతి ఇస్తాయనే ఫీలింగ్ అయితే మూవీ లవర్స్ లో కనిపిస్తుంది.
అనంతపురం జిల్లా పెనుగొండ కియా పరిశ్రమ నేపథ్యంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ రాసుకుని కొరియన్ కనకరాజు మూవీని మేర్లపాక గాంధీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ సత్య కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయించేలా ఉన్నా, కొరియన్ ఆత్మ వరుణ్ తేజ్ లో ఎంట్రీ ఇవ్వడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ మూవీని నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
