Varun Tej: ‘కొరియన్ కనకరాజు’గా.. వరుణ్ తేజ్ హర్రర్ థ్రిల్లర్

Varun Tej
విధాత: వరుసగా సినిమాల ప్లాఫులతో సతమతమవుతున్నమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల ‘మట్కా’ (Matka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో వరుణ్ తేజ్ ఈ సారి రూట్ మార్చాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్న వరుణ్ గతంలో సందీప్ కిషన్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి భారీ విజయాన్ని అందించిన మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ మూవీ రెగ్యులర్ సినిమాలా కాకుండా రాయలసీమ నేపథ్యంలో కొరియన్ బ్యాక్ డ్రాప్ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాకు తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయిక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
జనవరిలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే పేరు ఫిక్స్ చేశారని, ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా రూపొందుతుందని వినికిడి. ఇదిలాఉండగా ఈ చిత్రంలో పలువురు కొరియన్ నటులు నటిస్తుండగా ప్రస్తుతం వారి ఎంపిక చేసేందుకు ఆడిషన్స్ జరుగుతున్నట్లు సమాచారం.