Mamitha Baiju | లక్కీ ఛాన్స్ కొట్టేసినా మమిత బైజు.. విజయ్ దళపతి ఆఖరి మూవీలో హీరోయిన్ ‘ప్రేమలు’ బ్యూటీ..
Mamitha Baiju | తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయ రంగప్రవేశంతో త్వరలో సినిమాలకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాను సైతం ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హెచ్ వినోద్ దర్శకత్వంలో మూవీని తెరకెక్కించనున్నారు.
Mamitha Baiju | తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయ రంగప్రవేశంతో త్వరలో సినిమాలకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాను సైతం ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హెచ్ వినోద్ దర్శకత్వంలో మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ విజయ్‌కి 69వ సినిమా కావడం విశేషం. విజయ్ ఆఖరి మూవీ కావడంతో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీలో స్టార్ కాస్ట్‌ను మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ చత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇక హీరియిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మరో పాత్రలో ‘ప్రేమలు’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మమిత బైజుని తీసుకున్నట్లు వెల్లడించారు.
మమిత మలయాళంలో పలు సినిమాల్లో నటించింది. అయితే, పెద్దగా అవకాశాలు రాలేదు. గతేడాది మలయాళంలో విజయంతమైన మూవీని తమిళంతో పాటు తెలుగులో ‘ప్రేమలు’ మూవీని తెలుగులోనూ విడుదల చేయగా.. విజయవంతమైంది. ఇందులో మమిత నటన, డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. అంతకు ముందు 15 సినిమాల వరకు చేసినా దక్కని గుర్తింపు ఈ మూవీతో మమిత సొంతం చేసుకున్నది. ప్రస్తుతం విజయ్ దళపతి మూవీలోనూ ఛాన్స్ దక్కించుకున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి.. కెరీర్‌లో మమిత బిజీ కావాలని అభిమానులు ఆక్షాంక్షిస్తున్నారు. చివరిగా మమిత తమిళంలో రెబల్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దళపతి మూవీతో పాటు వీవీ21 చిత్రంలోనూ నటిస్తున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram