Maruva Tarama: ఆకట్టుకుంటున్న.. ‘మరువ తరమా’ ట్రైలర్
చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించిన ‘మరువ తరమా’ ట్రైలర్ ప్రేమ, సంగీతం, భావోద్వేగాలను కవితాత్మకంగా చూపిస్తూ మంచి బజ్ ను సృష్టించింది. హరీష్ ధనుంజయ, అథుల్య చంద్ర, అవంతిక హరి నల్వా నటించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన తారాగణంగా, చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మరువ తరమా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోహిణీ, ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసి ఆసక్తిని మరింత పెంచారు. ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది.
ట్రైలర్ చూస్తుంటే ఇది పూర్తి స్థాయి మ్యూజికల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. ప్రేమలోని మధుర క్షణాలు, బాధలు, భావోద్వేగాలు అన్నింటినీ కవితాత్మకంగా అల్లిన ప్రేమయాత్రలా అనిపిస్తోంది. ‘బేబీ’ ఫేం విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా కన్నులపండువగా మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.
“ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది.. అది ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు” అంటూ మొదలయ్యే ట్రైలర్‌లో ప్రేమపై పలికే డైలాగులు హృదయాన్ని తాకుతాయి. “లవ్ అనేది చెప్పలేని మ్యాజిక్… ప్రేమ అనేది చిన్న మాట అయినా దానిలో పడటం మాత్రం చాలా కష్టం” వంటి లైన్స్ తక్షణమే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక తమిళ ఇండస్ట్రీ క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ కార్తిక్ సుబ్బరాజ్, ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రాహుల్ రవీంద్రన్ కలిసి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రశంసించడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram