మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు!
మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు!
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ ‘మైఖేల్ జాక్సన్’కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్’. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు.
ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. ‘హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాదించుకుంటున్నారు. ఎదో రోజు నిన్ను కలుస్తా రక్షిత్’ అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.
‘నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమాని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం ఒక కొరియోగ్రాఫర్‌గా నాకు ఎంతో ప్రత్యేకమైన విషయం. ధన్యవాదాలు ప్రియమైన విన్సెంట్ సర్’ అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు రక్షిత్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ‘ఛత్రపతి’తో ప్రభాస్‌తో ప్రయాణం మొదలుపెట్టి.. ‘బాహుబలి’ వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. చత్రపతి, బిల్లా, బాహుబలి, ఆర్ఆర్ఆర్, అపరిచితుడు, రంగ్ దే బసంతి, సర్కార్, భోళా శంకర్ వంటి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram