Akhanda 2 | అఖండ 2 ఎఫెక్ట్‌తో ల‌బోదిబోమంటున్న చిన్న సినిమా నిర్మాత‌లు.. ఏకంగా అన్ని సినిమాల‌పై ఎఫెక్టా?

Akhanda 2 |నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’ చుట్టూ నెలకొన్న సందిగ్ధానికి ముగింపు పలుకుతూ, కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, నిర్మాతల ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడిన సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

  • By: sn |    movies |    Published on : Dec 11, 2025 8:08 AM IST
Akhanda 2 | అఖండ 2 ఎఫెక్ట్‌తో ల‌బోదిబోమంటున్న చిన్న సినిమా నిర్మాత‌లు.. ఏకంగా అన్ని సినిమాల‌పై ఎఫెక్టా?

Akhanda 2 |నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’ చుట్టూ నెలకొన్న సందిగ్ధానికి ముగింపు పలుకుతూ, కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, నిర్మాతల ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడిన సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్, ఈరోస్ ఇంటర్నేషనల్‌తో గతంలో కలిసి నిర్మించిన చిత్రాలకు సంబంధించిన రూ. 28 కోట్ల ఫైనల్ సెటిల్‌మెంట్ జరగకపోవడంతో, ఈరోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో బాలయ్య సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు పరిశ్రమ పెద్దల జోక్యంతో రెండు సంస్థల మధ్య చర్చలు జరిగి సమస్య పరిష్కారమైంది. దీంతో తాజా నిర్ణయం ప్రకారం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ విడుదల, డిసెంబర్ 11న ప్రీమియర్ షోలు జరుగనున్నాయి.

డిసెంబర్ 12న ‘అఖండ 2’ విడుదల కావడం వల్ల ఇప్పటికే ప్రకటించిన 14 కొత్త సినిమాలతో పాటు 3 రీ-రిలీజ్ మూవీలపై భారీ ప్రభావం పడనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న మాస్ క్రేజ్ కారణంగా పెద్ద విపత్తే ఎదురవుతుందని చిన్న చిత్రాల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తుండటం, గత సినిమా కలెక్షన్ల ప్రభావం… ఇవన్నీ కలసి ‘అఖండ 2’ హైప్‌ను మరింత పెంచాయి. అందువల్ల అదే సమయంలో రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాలు థియేటర్లు దొరకక ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది.

ఇపుడు రిలీజ్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ‘సైకో సిద్ధార్థ’, ‘సహకుటుంబమానం’, ‘మౌళి’, ‘ఈషా’, ‘డ్రైవ్’, ‘అన్నగారు వస్తున్నారు’ వంటి చిన్న చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ‘మోగ్లీ’ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా… ‘అఖండ 2’ దెబ్బతో ఒక రోజు పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. నందు హీరోగా చేసిన ‘సైకో సిద్ధార్థ’ జ‌న‌వ‌రి 1న విడుద‌ల కానుంది. కొన్ని చిన్న‌ సినిమాలు తమ రిలీజ్ తేదీలను వాయిదా వేసుకోగా, మ‌రి కొన్ని సాహసంగా పోటీకి దిగుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇక ప్రమోషన్స్ విషయంలో, మొదట డిసెంబర్ 5 విడుదలను లక్ష్యంగా పెట్టుకుని అఖండ 2 టీమ్ భారీగా ప్రచారం చేసింది. బాలకృష్ణ హిందీ ఇంటర్వ్యూలు ప్రత్యేకంగా వైరల్ అయ్యాయి. బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌పై మాస్ ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 12పై ఉంది. అఖండ 2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, బాక్సాఫీస్‌ను ఎలా శాసిస్తుందో అన్నది చూడాలి.