Allu Arjun | ఐకాన్ స్టార్ బర్త్‌డే స్పెషల్: టైటిల్ పోస్టర్‌తోనే సరిపెట్టనున్న అల్లు అర్జున్–అట్లీ మూవీ టీమ్!

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీ నుండి ఎలాంటి కంటెంట్ బ‌య‌ట‌కు రాలేదు. అయితే బ‌న్నీ బ‌ర్త్‌డే సందర్భంగా అభిమానులు చిత్రం గురించి ఏదైన అప్‌డేట్ వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీ నుండి ఎలాంటి కంటెంట్ బ‌య‌ట‌కు రాలేదు. అయితే బ‌న్నీ బ‌ర్త్‌డే సందర్భంగా అభిమానులు చిత్రం గురించి ఏదైన అప్‌డేట్ వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా అప్‌డేట్‌పై స్పష్టత వ‌చ్చింది. ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్ లేదా వీడియో కంటెంట్ విడుదల కాకుండా, కేవలం టైటిల్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.

బన్నీ వాసు క్లారిటీ..

ఈ విషయాన్ని నిర్మాత బ‌న్నీ వాసు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “నాకు తెలిసినంత వరకు కేవలం టైటిల్ మరియు పోస్టర్ మాత్రమే రిలీజ్ అవుతాయి. ఎటువంటి విజువల్ కంటెంట్ విడుదల చేయడం లేదు. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కావడంతో, ప్రస్తుతానికి ఎలాంటి విజువల్స్‌ను బయటపెట్టకూడదని టీమ్ నిర్ణయించుకుంది” అని ఆయన తెలిపారు.

ఈ ప్రకటనతో అభిమానుల్లో ఒకవైపు ఆసక్తి పెరుగుతుండగా, మరోవైపు కొంత నిరాశ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు. ముఖ్యంగా ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండటంతో, దాని విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.

టైటిల్‌తో హైప్ పెంచే ప్ర‌య‌త్నం..

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంక‌ర్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్‌డే రోజున విడుదలయ్యే టైటిల్ ఏమిటన్నదానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ డిస్కషన్ మొదలైంది. టైటిల్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, టీజర్ లేకపోయినా టైటిల్ పోస్టర్‌తోనే అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు అందరి చూపు ఆ పవర్‌ఫుల్ టైటిల్‌పైనే ఉంది.

Latest News