AMB Cinemas | బెంగళూరులో ఏఎంబి సినిమాస్.. జనవరి 16న గ్రాండ్ ఓపెనింగ్
AMB Cinemas | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యంగా ఆయన ప్రారంభించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ ఇప్పటికే హైదరాబాద్‌లో సినీప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
AMB Cinemas | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యంగా ఆయన ప్రారంభించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ ఇప్పటికే హైదరాబాద్‌లో సినీప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం సౌకర్యాలతో హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ మంచి క్రేజ్‌ను దక్కించుకోగా, ఇప్పుడు అదే అనుభూతిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు మహేష్ బాబు అడుగులు వేస్తున్నారు.
ఈ విస్తరణలో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభానికి సిద్ధమైంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా డాల్బీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్న ఈ మల్టీప్లెక్స్‌ను జనవరి 16న ఘనంగా ప్రారంభించనున్నట్లు మహేష్ బాబు అధికారికంగా ప్రకటించారు. అత్యుత్తమ విజువల్స్, ప్రపంచస్థాయి సౌండ్ టెక్నాలజీతో ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ థియేటర్‌ను రూపొందించినట్లు సమాచారం.
బెంగళూరులో ఏఎంబి సినిమాస్ ప్రారంభం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ స్థాయిలో మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేయడంలో తన ఏఎంబి టీమ్ చూపిన అంకితభావం, శ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ప్రతి చిన్న వివరాన్ని పక్కాగా ప్లాన్ చేసి, ప్రేక్షకుల అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చిన తమ టీమ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని మహేష్ అన్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రీమియం మల్టీప్లెక్స్‌గా పేరు తెచ్చుకున్న ఏఎంబి సినిమాస్, బెంగళూరు ఎంట్రీతో దక్షిణ భారత మార్కెట్‌లో మరింత బలపడనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రధాన నగరాల్లో ఏఎంబి సినిమాస్‌ను విస్తరించాలన్న ఆలోచనలో మహేష్ బాబు ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా తన బ్రాండ్‌ను విస్తరిస్తున్న మహేష్ బాబు ప్రయాణంలో ఇది మరో కీలక అడుగుగా నిలవనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram