ఆసియాలోనే.. మొట్టమొదటి రియల్ లైఫ్ మల్టీ థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్
హైదరాబాద్ AMB మాల్‌లో ప్రారంభమైన మ్యాజిక్ డిస్ట్రిక్ట్ అడ్వెంచర్ జోన్ సందర్శకులనే కథలో భాగం చేసే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది.
హైదరాబాద్ కొండాపూర్‌లోని AMB మాల్ (శరత్ సిటీ క్యాపిటల్ మాల్)లో ఆసియాలోనే తొలిసారిగా రూపొందించిన రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ ప్రారంభమైంది. ఇది కేవలం వినోదం కోసం కాకుండా సందర్శకులే కథలో భాగమై, ప్రత్యక్షంగా సాహసాలను అనుభవించే సరికొత్త కాన్సెప్ట్‌గా రూపొందడం విశేషం.
AMB మాల్‌లోని ఆరో అంతస్తులో సుమారు 38 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ జోన్‌ను సినిమా సెట్ల తరహాలో రూపొందించారు. అడుగడుగునా ఉత్కంఠను పెంచే వాతావరణం, లైవ్ ఇంటరాక్షన్లు, ప్రత్యేక సౌండ్ & లైట్ ఎఫెక్ట్స్‌తో ఇది పూర్తిస్థాయి అనుభూతిని అందిస్తోంది.
ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“భారతీయుల సృజనాత్మకతను ప్రపంచ స్థాయిలో పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. ఈ రంగంలో 25 ఏళ్ల అనుభవంతో హైదరాబాద్ ప్రజలకు ఇలాంటి ప్రపంచస్థాయి అడ్వెంచర్ అనుభవాన్ని అందిస్తున్నాం. ఇది తొలి దశ మాత్రమే” అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ డైరెక్టర్ చందన లిపి మాట్లాడుతూ, మొదటి దశలో నాలుగు ప్రత్యేకమైన అడ్వెంచర్ ప్రపంచాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. యువతతో పాటు కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఆస్వాదించేలా ఈ కాన్సెప్ట్‌ను రూపొందించామని ఆమె తెలిపారు. మొత్తం ఏడు విభిన్న థీమ్‌లను అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా, ప్రస్తుతం మొదటి దశలో నాలుగు అడ్వెంచర్ ప్రపంచాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌కు నగరవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
తొలి దశలో.. అందుబాటులో ఉన్నవి
జోంబీ సిటీ: జోంబీలు ఆక్రమించిన నగరంలో చిక్కుకుని, ధైర్యంతో బయటపడే ఉత్కంఠభరిత అనుభవం.
స్కేరీ ఎస్కేప్స్: భయానక వాతావరణంలో క్లూస్‌ను అనుసరిస్తూ, పజిల్స్‌ను పరిష్కరిస్తూ తప్పించుకోవాల్సిన టీమ్ అడ్వెంచర్.
స్కేరీ హౌస్: హారర్‌ను ఇష్టపడే వారికోసం లైవ్ పాత్రలు, భయానక సౌండ్ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన ప్రత్యేక ప్రపంచం.
బూ బూ హౌస్: చిన్నారుల కోసం రూపొందించిన సరదా-స్పూకీ జోన్. భయం కాకుండా ధైర్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశ్యం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram