Bandla Ganesh | “ఆయ‌న చెప్పుతో కొట్టాడు.. అదే నా జీవితాన్ని మార్చింది”.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Bandla Ganesh | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్వ్యూల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న బండ్లన్న.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి.

  • By: Sandeep |    movies |    Published on : May 25, 2026 8:02 AM IST
Bandla Ganesh | “ఆయ‌న చెప్పుతో కొట్టాడు.. అదే నా జీవితాన్ని మార్చింది”.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Bandla Ganesh | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్వ్యూల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న బండ్లన్న.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి.

ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ కార్యక్రమానికి హాజరైన బండ్ల గణేష్ తన సినీ జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనను బయటపెట్టారు. ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన తెలిపారు. అయితే ఆ ఘటనలో ఉన్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగించారు.

నన్ను చెప్పుతో కొట్టారు..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి ఉండేవారు. ఆయన మంచి మనిషే. నాకు ఎన్నో సందర్భాల్లో సహాయం కూడా చేశారు. కానీ ఒక రోజు ఏమైందో తెలియదు. నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే ఆ సంఘటన జరిగింది” అని తెలిపారు.

ఆ రోజు తాను, మరో నటుడు కలిసి ఆయన పక్కన కూర్చున్నామని చెప్పారు. “మామూలుగా మనకు సార్ అని పిలిచే అలవాటు ఉంటుంది. అలాగే నేను కూడా సార్.. సార్ అని మాట్లాడుతున్నా. కానీ సడెన్‌గా ఏమైందో తెలియదు.. చెప్పు తీసుకుని నన్ను కొట్టారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. రెండు రోజుల తర్వాత ఆయన నాతో సారీ కూడా చెప్పారు” అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

అదే ట‌ర్నింగ్ పాయింట్..

అయితే ఆ సంఘటన తనలో పట్టుదల పెంచిందని బండ్లన్న భావోద్వేగంగా తెలిపారు. “అప్పుడు నా దగ్గర ఉన్న మరో వ్యక్తితో నేను ఒక మాట చెప్పాను. ‘నా దగ్గర డబ్బు లేదనే కదా ఇలా జరిగింది.. ఒకరోజు ఆయనకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా’ అని అన్నాను. అదే నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. అదే నా అచీవ్‌మెంట్” అని అన్నారు.

అయితే తనను అవమానించిన ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో సీనియర్ నటుడి పేరును ప్రస్తావిస్తూ ఊహాగానాలు మొదలుపెట్టారు.

మరోవైపు కొందరు అభిమానులు మాత్రం బండ్ల గణేష్ కథలోని అసలు సందేశం అవమానం కాదు.. దాన్ని అవకాశంగా మార్చుకుని జీవితంలో ఎదగాలనే తపన అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బండ్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.