Lavanya | సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హంగామా చేసింది. గ్రామస్థులతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి మల్లేపల్లి వద్ద కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆమె, అక్కడ నుండి పారిపోతుండగా కారును మల్లేపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు.
గ్రామస్థులు క్షమాపణ చెప్పాలని కోరగా, లావణ్య వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న తర్వాత కూడా కొంతసేపు వాగ్వాదం కొనసాగినట్లు తెలుస్తోంది. స్థానికుల ప్రకారం, కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పాత వివాదాలు మళ్లీ చర్చలోకి
లావణ్య పేరు వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశాడని, గర్భస్రావం చేయించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వివాదం విషయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం చల్లారింది అనుకునే లోపు లావణ్య ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మరోసారి హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు ప్రమాద ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తోంది.
