Chiranjeevi | ‘మెగా 158’కి రంగం సిద్ధం.. చిరంజీవి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న చిరంజీవి, ఇప్పుడు అదే ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్ట్ ‘మెగా 158’ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) తెరకెక్కించనున్న ఈ భారీ చిత్రం పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ ఇటీవల పూర్తయ్యింది. చిరంజీవిని పూర్తిగా కొత్త స్టైల్‌లో చూపించేందుకు దర్శకుడు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక షూటింగ్‌ను హైదరాబాద్ శివార్లలో నిర్మించిన భారీ సెట్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది.
యంగ్ లుక్‌లో..
ఇదిలా ఉండగా, తాజాగా మెగా టీమ్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో చిరంజీవి ఎంతో స్టైలిష్‌గా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తెల్లటి అవుట్‌ఫిట్‌లో క్లాసీగా కనిపించిన చిరు, మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ మెగా టీమ్ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. “తరాలు మారాయి… ట్రెండ్స్ కనుమరుగయ్యాయి… కానీ ఆయన ఆరా మాత్రం సాటిలేనిది. చిరంజీవి – ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతం” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
మెగాస్టార్‌కే సాధ్యం..
చిరంజీవి లుక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “70 ఏళ్ల వయసులోనూ ఇంత స్టైలిష్‌గా కనిపించడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యం”, “యంగ్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక ‘మెగా 158’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram