Chiranjeevi | రామ్ చరణ్ 41వ జన్మదిన వేడుకని చాలా స్పెష‌ల్‌గా మార్చిన చిరంజీవి.. ఎమోష‌న‌ల్ అయిన ఫ్యాన్స్

Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన 41వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించి చరణ్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘పెద్ది’ టీజర్ విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన 41వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించి చరణ్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘పెద్ది’ టీజర్ విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

టాలీవుడ్ సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపార. అయితే అందరిలో ప్రత్యేకంగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్. చిరంజీవి తన కుమారుడికి విషెస్ తెలుపుతూ హృదయాన్ని తాకే సందేశాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిచే స్థాయి నుంచి, ఈరోజు కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతౌల్యంగా నడిపించే నీ తీరు, కుటుంబంపై నీ బాధ్యత, దేవుడిపై నీ నమ్మకం, క్రమశిక్షణ… ఇవన్నీ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అంటూ ప్రేమతో కూడిన మాటలు చెప్పారు.

ఎమోష‌న‌ల్ పోస్ట్..

అలాగే దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ ఎప్పటికీ తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ “హ్యాపీ బర్త్‌డే డియర్ రామ్ చరణ్” అని ముగించారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియాలో రామ్ చరణ్ చిన్ననాటి అరుదైన ఫోటోలను కూడా పంచుకున్నారు. తండ్రి-కొడుకు మధ్య ఉన్న ఆప్యాయతను ప్రతిబింబించే ఈ క్యూట్ ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు చూడని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం విశేషం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ఎన్‌టీఆర్ నేషనల్ అవార్డు నగదు బహుమతి రూ.10 లక్షలను చిరంజీవి వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు. వృద్ధుల సంక్షేమం కోసం సర్వ్ ఫౌండేషన్, అంధుల సేవ కోసం దేవనార్ ఫౌండేషన్, అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఈ విరాళాలు అందజేశారు.

వృద్ధుల‌కి కొత్త బ‌ట్ట‌లు..

మరోవైపు, ఈసారి రామ్ చరణ్ పుట్టినరోజు శ్రీరామనవమి రోజునే రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌కు వృద్ధులను ఆహ్వానించి వారికి కొత్త బట్టలు అందించి స్వయంగా భోజనం వడ్డించడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు. మొత్తంగా, రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సందడితో పాటు భావోద్వేగ క్షణాలతో మరింత ప్రత్యేకంగా నిలిచాయి. అభిమానులు, సినీ ప్రముఖుల ఆశీస్సులతో చరణ్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు.

Latest News