Chiranjeevi | తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికగా చిరంజీవి వినూత్న సందేశం .. చంద్రబాబుకు ప్రత్యేక విజ్ఞప్తి
Chiranjeevi | హైదరాబాద్‌లో ఉగాది సందర్భంగా ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్’ను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
Chiranjeevi | హైదరాబాద్‌లో ఉగాది సందర్భంగా ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్’ను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ అవార్డు స్వీకరణ అనంతరం మాట్లాడిన చిరంజీవి, ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి, అలాగే సినీ ప్రముఖులు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, జయసుధ, నాగ చైతన్య, రష్మిక మందన్న తదితరులను అభినందించారు.
కళాకారులకు గౌరవం – రాష్ట్ర అభివృద్ధికి బాట
చిరంజీవి మాట్లాడుతూ, ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో, ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఫిల్మ్ అవార్డ్స్‌ను మళ్లీ పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా రంగం ప్రభావం ఎంత ఉందో ప్రభుత్వం అర్థం చేసుకుని, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్‌గా తీర్చిదిద్దాలి
హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటంతో పాటు, అన్ని రకాల మౌలిక వసతులు కలిగి ఉందని చిరంజీవి చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఇండియన్ సినిమా కేంద్రంగా, అంతర్జాతీయ సినిమాల హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.
గ్లోబల్ సమ్మిట్‌లలో సినిమాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, సినీ రంగంతో చర్చలు జరపడం వంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ ఇండస్ట్రీ ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు విజ్ఞప్తి
ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చిరంజీవి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి, అక్కడ కూడా సినీ రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే యువత మంచి సినిమాలు తీస్తారు. దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుంది. తెలంగాణ తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా రంగాన్ని బలోపేతం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రంగం అభివృద్ధి ద్వారా రాష్ట్రాల ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram