Filmfare Awards South | ఫిలింఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన పుష్ప 2.. బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ అందుకున్న బన్నీ
Filmfare Awards South | దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది.
Filmfare Awards South | దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన 2024లో విడుదలైన సినిమాలను పరిగణలోకి తీసుకుని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు.
బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘Pushpa 2: The Rule’ చిత్రంలో పుష్పరాజ్ పాత్రకు గాను ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఈ విజయంతో బన్నీ మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న టాలీవుడ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డులతో కలిపి 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఉత్తమ చిత్రం, దర్శకుడు
ఉత్తమ చిత్రంగా ‘Pushpa 2: The Rule’ ఎంపిక కాగా, ఈ సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు వరించింది.
నటీనటుల విభాగాల్లో విజేతలు
‘35 చిన్న కథ కాదు’ సినిమాకి గాను నివేదా థామస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.‘కల్కి 2898 AD’ చిత్రానికి గాను అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటనకు గాను అంజలి ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో ‘సత్యభామ’ చిత్రానికి గాను కాజల్ అగర్వాల్ ఉత్తమ నటి(క్రిటిక్స్)గా ఎంపికయ్యారు. ‘హనుమాన్’లో నటనకు గాను తేజ సజ్జా ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) అవార్డు అందుకున్నారు.
సంగీత విభాగంలో ‘పుష్ప 2’ హవా
‘Pushpa 2: The Rule’ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ‘గుంటూరు కారం’లోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు గాను శ్రీ కృష్ణ ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. అదే పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. మొత్తంగా 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుకలో ‘పుష్ప 2’ సత్తా చాటగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కళాకారులు అవార్డులు అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ వేడుక దక్షిణాది సినీ రంగ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.
70 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) విజేతలు వీరే!
ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)
బెస్ట్ డెబ్యూ ఫిమేల్ – నయన్ సారిక (గం గం గణేశ)
బెస్ట్ డెబ్యూ మేల్ – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ ( కుర్చీ మడతపెట్టి – గుంటూరు కారం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram