Hema | అంతా ఆ గొట్టంగాడే చేశాడు .. ‘మా’ సస్పెన్షన్‌పై సంచలన వ్యాఖ్యలు

Hema | సీనియర్ నటి హేమపై కొన్నేళ్ల క్రితం నమోదైన డ్రగ్స్ కేసులో కోర్టు తాజాగా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ కేసు కారణంగా ఆమె ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ సభ్యత్వం తాత్కాలికంగా సస్పెండ్ కావడం తెలిసిందే.

  • By: sn |    movies |    Published on : Dec 01, 2025 12:30 PM IST
Hema | అంతా ఆ గొట్టంగాడే చేశాడు .. ‘మా’ సస్పెన్షన్‌పై సంచలన వ్యాఖ్యలు

Hema | సీనియర్ నటి హేమపై కొన్నేళ్ల క్రితం నమోదైన డ్రగ్స్ కేసులో కోర్టు తాజాగా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ కేసు కారణంగా ఆమె ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ సభ్యత్వం తాత్కాలికంగా సస్పెండ్ కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆరోపణలన్నింటినీ కోర్టు కొట్టివేయడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మా వ్యవహారాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

“నన్ను సస్పెండ్ చేయించింది ‘మా’లోని కొందరే” – హేమ

ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ, “డ్రగ్స్ కేసును హైలైట్ చేసింది మీడియా కాదు, ‘మా’లోని కొంతమంది. శివబాలాజీ కింద ఉన్న ఒక వ్యక్తి నాపై నోటీసులు ఇవ్వించాడు. అప్పట్లో విష్ణు బాబు షూటింగ్‌లో ఉండగా, ‘హేమ డ్రగ్స్ తీసుకుంది, అరెస్ట్ చేశారు’ అని ఎవరో అబద్ధాలు చెప్పి విష్ణుని తప్పుదారి పట్టించారు. ఆయనకు అసలు నిజం తెలియదు” అని అన్నారు.

“విష్ణు వచ్చాక నేను మాట్లాడాను… ఆయన నన్ను సపోర్ట్ చేశారు”

హేమ మాట్లాడుతూ.. విష్ణు బాబు తిరిగి వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆయన నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారు. ‘నిజం తేలేవరకు ఎలాంటి అపవాదాలు వేయొద్దు’ అని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదాం అన్నాడు. నేను కూడా అదే చెప్పాను. నిజంగా తప్పు చేసినా, నా మెంబర్‌షిప్ మొత్తానికీ తీసేయండి అని చెప్పాను. అయితే ఇది అంతా ‘మా’లో ఉన్న ఒక గొట్టం గాడు చేసిన పని. వాడే న్యూస్ లీక్ చేసి మీడియాను రెచ్చగొట్టాడు. నా మీద నెగిటివ్ క్యాంపెయిన్ నడిపించాడు. వాడివల్లే నా మెంబర్షిప్ సస్పెండ్ అయ్యింది. కానీ తర్వాత విష్ణు బాబు నాకు ‘మా’ కార్డు తిరిగి ఇచ్చారు” అని హేమ చెప్పింది.

డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ రావడంతో పాటు, ‘మా’లో జరిగిన అంతర్గత రాజకీయాలను హేమ బహిర్గతం చేయడంతో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఆమె మాటల్లోని తీవ్రత, ఆరోపణలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇక సినిమాల విషయానికి వ‌స్తే ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసిన హేమ ఇప్పుడు మాత్రం త‌గ్గించేసింది. ఏదో అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే క‌నిపించి అల‌రిస్తుంది.