విధాత, హైదరాబాద్ : .సహా(లైఫ్ ఆఫ్ సంజు) సినిమా చూసిన ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తే..నేను అమీర్ పేట్ సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటా’ అని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శివకుమార్ కాసారం- శ్వేతా లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సహా. లైఫ్ ఆఫ్ సంజు అనేది సినిమా క్యాప్షన్. దర్శకుడు నిశాంత్ దోటి లవ్ ఆండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ గురువారం ట్రైలర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ జరిగిన ఈ ఈవెంట్లో నటీనటులు, ప్రొడ్యూసర్ బన్నివాసు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్లు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ సినిమాపై నమ్మకం వ్యక్తం చేస్తూ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయబోదని అన్నారు. డిసప్పాయింట్ చేస్తే నేను అమీర్ పేట సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటా’ అని అన్నారు.
ఇక హీరో శివకుమార్ కాసారం మాట్లాడుతూ ఒక తోపు సినిమాను చూడబోతున్నామని అంచనాలు పెట్టకోండని, మీ అంచనాలకు ఒక్క పర్సంట్ తక్కువైనా నాకు కాల్ చేసి నన్ను బూతులు తిట్టండి’ అంటూ ఆయన ఫోన్ నెంబర్ ప్రజలకు ఇచ్చారు. వారి వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు సినిమాపై నమ్మకం ఉండోచ్చుగాని..ఈ రకమైన అనవసరపు ప్రతిజ్ఞలు ఎందుకని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా బాగోకపోతే అమీర్ పేట్ సెంటర్ లో గుండు కొట్టించుకుంటా.. నా నెంబర్ కు కాల్ చేసి బూతులు తిట్టండి!
– హీరో, హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్!#Sahaa pic.twitter.com/JhxMtVr5sK
— Telugu360 (@Telugu360) August 27, 2026
