Jagapathi Babu | ‘పెద్ది’లో అప్పలసూరిగా జగపతిబాబు విశ్వరూపం.. డబ్బింగ్ వీడియో చూసి షాక్

Jagapathi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడం, బుచ్చిబాబు మార్క్ రూరల్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Reported by: Sandeep | సినిమా | May 26, 2026, 4:14 pm IST
Read Time: 5 mins
Jagapathi Babu | ‘పెద్ది’లో అప్పలసూరిగా జగపతిబాబు విశ్వరూపం.. డబ్బింగ్ వీడియో చూసి షాక్

Jagapathi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడం, బుచ్చిబాబు మార్క్ రూరల్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త అప్‌డేట్ అభిమానులను మరింత ఉత్సాహానికి గురి చేస్తోంది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు జ‌గ‌ప‌తి బాబు అత్యంత కీలకమైన ‘అప్పలసూరి’ పాత్రలో నటిస్తున్నారు. కథలో ప్రధాన మలుపులకు కారణమయ్యే పవర్‌ఫుల్ పాత్రగా దీనిని చిత్రబృందం ముందుగానే హైలైట్ చేసింది. ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేక డబ్బింగ్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వీడియోలో జగపతిబాబు ఒక భావోద్వేగ సన్నివేశానికి డబ్బింగ్ చెబుతూ పూర్తిగా పాత్రలో లీనమైన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆయన గంభీరమైన వాయిస్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఇంటెన్సిటీ చూస్తుంటే ‘అప్పలసూరి’ పాత్ర సినిమా మొత్తానికి కీలక బలంగా నిలవనుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌..

సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవుతుండగా, చాలా మంది అభిమానులు ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్ పాత్రను మించే రోల్ ఇది కావచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

జగపతిబాబు కెరీర్‌ను పరిశీలిస్తే, ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ స్టోరీ సినిమాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత కెరీర్‌లో కీలక మలుపు తీసుకున్నారు. 2014లో విడుదలైన Legend చిత్రంలో విలన్‌గా చేసిన పాత్ర ఆయన సినీ ప్రయాణానికి కొత్త దిశను ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

బిజీ బిజీగా..

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఎమోషనల్ పాత్రల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ బిజీ నటుడిగా కొనసాగుతున్నారు.

గతంలో రామ్ చరణ్‌తో రంగ‌స్థ‌లం చిత్రంలో చేసిన ప్రెసిడెంట్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే నాన్నకు ప్రేమ‌తో, అర‌వింద స‌మేత వంటి చిత్రాల్లో కూడా తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందారు.

ఇప్పుడు ‘పెద్ది’లో అప్పలసూరి పాత్రతో మరోసారి తన నటనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్, భారీ తారాగణం, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.