Jagapathi Babu | “ నా ఫస్ట్ క్రష్ మా తమిళ్ టీచర్ ”.. జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

Jagapathi Babu | ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన నటనలో కొత్త కొత్త కోణాలు చూపిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఆయన, త్వరలో వదలా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న జగపతి బాబు తాజాగా చెప్పిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జగపతి బాబు, తన ఫస్ట్ క్రష్ గురించి సరదాగా చెప్పుకొచ్చారు. “నేను చెన్నైలో ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా తమిళ్ టీచర్ మీద నాకు క్రష్ ఉండేది” అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ ఇష్టం ఒకటి రెండు రోజులు కాదు, దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు కొనసాగిందని తెలిపారు.

35 ఏళ్ల వ‌య‌స్సులో క‌లిసాను..

ఆ టీచర్ గురించి చెబుతూ జగపతి బాబు ఆసక్తికరంగా స్పందించారు. “ఆమె డస్కీగా ఉండేది. తలలో కొప్పు పెట్టుకొని, మందార పువ్వు పెట్టుకొని ప్రతిరోజూ స్కూల్‌కి వచ్చేది. ఎందుకో ఆమెంటే నాకు చాలా ఇష్టం. కానీ అది ఎలాంటి ఇష్టమో అప్పుడు నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. ఎప్పుడూ చెప్పలేకపోయాను” అని అన్నారు.

ఇక చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు మరింత వైరల్ అవుతున్నాయి. “నేను హీరోగా సక్సెస్ సాధించిన తర్వాత, దాదాపు 35 ఏళ్ల వయసులో ఒకసారి ఆమెను మళ్లీ కలిశాను. అప్పటికి ఆమెకు సుమారు 60 ఏళ్లు ఉండొచ్చు. నేను మంచి బిల్డప్‌తో కారులో వెళ్లాను” అంటూ సరదాగా చెప్పారు.

ఆమె చూపు జ‌న్మ‌లో మ‌రిచిపోలేను..

ఆ తరువాత ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని, చివర్లో వెళ్తూ “నాకు మీ మీద అప్పట్లో క్రష్ ఉండేది” అని చెప్పానని జగపతి బాబు వెల్లడించారు. “అంతే… ఆమె ఒక్కసారి చూసిన చూపు నేను జన్మలో మర్చిపోలేను” అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

జగపతి బాబు నిజాయితీగా చెప్పిన చిన్ననాటి ప్రేమ కథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలామంది “ఇలాంటి జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి”, “జగపతి బాబు ఎంత ఓపెన్‌గా చెప్పారో చూడండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆయన చెప్పిన తీరు, ఎమోషన్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, హీరో నుంచి విలన్‌గా మారిన తర్వాత జగపతి బాబు కెరీర్ మరోస్థాయికి వెళ్లింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్‌, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ‘వదలా’ సినిమాతో మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Latest News