JD Chakravarthy | విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్‌పై జేడీ చక్రవర్తి క్లారిటీ… అది గురు–శిష్య బంధం మాత్రమే ..

JD Chakravarthy | యాంకర్ విష్ణు ప్రియ‌ ఇటీవల పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌తో హాట్ టాపిక్‌గా మారిన ఆమెపై కొన్ని ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇదే సమయంలో సీనియర్ నటుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తితో ఆమెకు ప్రత్యేకమైన సంబంధం ఉందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 26, 2026 4:30 PM IST
JD Chakravarthy | విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్‌పై జేడీ చక్రవర్తి క్లారిటీ… అది గురు–శిష్య బంధం మాత్రమే ..

JD Chakravarthy | యాంకర్ విష్ణు ప్రియ‌ ఇటీవల పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌తో హాట్ టాపిక్‌గా మారిన ఆమెపై కొన్ని ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇదే సమయంలో సీనియర్ నటుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తితో ఆమెకు ప్రత్యేకమైన సంబంధం ఉందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ గాసిప్స్‌పై తాజాగా జేడీ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. “నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్” అని స్పష్టం చేశారు.

గురు శిష్యుల బంధం..

విష్ణుప్రియతో తన సంబంధంపై మాట్లాడుతూ… “ఆమె నా ప్రియ శిష్యురాలు. నేను ఫోన్ చేస్తే గురువుగారు అంటూ మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయితో నాకు ఎఫైర్ ఉందని చెప్పడం కంటే దుర్మార్గం ఇంకేమీ ఉండదు” అని అన్నారు. తాను ఆమెను పెళ్లి చేసుకోవడం అసంభవమని, అది గురు–శిష్య సంబంధం మాత్రమేనని వివరించారు.

అలాగే గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆయన స్పందించారు. ఒక గేమ్ షోలో ఆమె తనపై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రేమిస్తున్నానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ… “ఆమె నాకు కాదు, నేను నటించిన పాత్రలకు అభిమానిగా మారింది” అని తెలిపారు. కలిసి ఓ వెబ్ సిరీస్‌లో పని చేసిన సమయంలో దర్శకుడు తన సినిమాలు చూడమని చెప్పడంతో, ఆ పాత్రలపై ఆకర్షణ పెరిగిందని వివరించారు.

పుకార్ల‌కి చెక్…

ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, కేవలం గురు–శిష్య అనుబంధమే ఉందని మరోసారి స్పష్టం చేసిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్‌కు పూర్తి స్థాయిలో చెక్ పడినట్లైంది.