Krishna | ‘సింహాసనం’కు 40 ఏళ్లు .. ఈ సినిమా థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ఏకంగా 144 సెక్ష‌న్ పెట్టారంటే నమ్ముతారా?

Krishna | తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాలకు, సాహసాలకు మారుపేరుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వినూత్న చిత్రాలతో ఇండస్ట్రీకి కొత్త దారులు చూపించారు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం సింహాసనం విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1986 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.

Krishna | తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాలకు, సాహసాలకు మారుపేరుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వినూత్న చిత్రాలతో ఇండస్ట్రీకి కొత్త దారులు చూపించారు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం సింహాసనం విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1986 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.

‘సింహాసనం’ తెలుగు సినిమాకు సాంకేతికంగా కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇది తొలి తెలుగు 70MM, 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో రూపొందిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని స్వయంగా కృష్ణ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఆయన విజన్, టెక్నికల్ ప్రెజెంటేషన్ అప్పట్లోనే హాలీవుడ్ స్థాయిని తలపించాయని సినీ వర్గాలు చెబుతుంటాయి.

రూ.1.5 కోట్లకు పైగా వసూళ్లు..

కథ విషయానికి వస్తే, దశార్ణ రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న విక్రమసింహ (కృష్ణ) ప్రతిభను గుర్తించిన రాజు క్షేమేంద్ర భూపతి అతనికి భవానీ ఖడ్గాన్ని బహుమతిగా ఇస్తాడు. యువరాణి అలకనంద (జయప్రద) విక్రమసింహను ప్రేమిస్తుంది. అయితే మంత్రి భేరుండ (ప్రభాకర్ రెడ్డి) కుట్రల వల్ల విక్రమసింహ రాజ్యం నుంచి వెలివేయబడతాడు. అనంతరం అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తిరిగి రాజ్యంలోకి ఎలా వచ్చాడు? అన్నది కథలో ప్రధానాంశం.

విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం రూ.1.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అప్పట్లోనే పెద్ద రికార్డు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా కూడా ‘సింహాసనం’ నిలిచింది.

144 సెక్ష‌న్ అమ‌లు..

ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, థియేటర్ల వద్ద భారీ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించగా, విజయవాడలోని థియేటర్ల వద్ద సెక్షన్ 144 అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఉన్నవారినే థియేటర్ ప్రాంతంలోకి అనుమతించడం అప్పట్లో సంచలనంగా మారింది.

మొత్తానికి, ‘సింహాసనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ టెక్నికల్ అభివృద్ధికి దారితీసిన ఒక మైలురాయి. 40 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది.

Latest News