Mega 158 | మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం గ్రాండ్ లాంచ్.. సంద‌డి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు

Mega 158 | టాలీవుడ్‌లో తనదైన స్టైల్, మ్యానరిజం, ఎనర్జీతో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మరోసారి తన జోరు కొనసాగిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 158వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Mega 158 | టాలీవుడ్‌లో తనదైన స్టైల్, మ్యానరిజం, ఎనర్జీతో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మరోసారి తన జోరు కొనసాగిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 158వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు కొల్లి బాబి దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం గురువారం (మే 21) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సాధారణంగా సినిమా ప్రారంభోత్సవాలు సింపుల్‌గా నిర్వహిస్తారు. కానీ ఈ చిత్రం ప్రారంభ వేడుక మాత్రం భారీ స్థాయిలో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ సినిమా కావడం, అలాగే నిర్మాతలకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది కీలకమైన ప్రాజెక్ట్ కావడంతో మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు కనిపించింది.

మెగా బ్ర‌ద‌ర్స్ ఒకే ఫ్రేములో..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు హాజరుకావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మెగా కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యుల మధ్య కనిపించిన ఆత్మీయ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

వాల్తేరు వీర‌య్య త‌ర్వాత‌..

సినిమా సాంకేతిక బృందం కూడా ఎంతో బలంగా ఉంది. సంగీత బాధ్యతలను థ‌మ‌న్ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు. భారీ మాస్ అంశాలతో పాటు విజువల్‌గా కూడా సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికే చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీర్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు, వినోదం, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ఆ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమా రావడంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథా నేపథ్యం వంటి పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే ప్రారంభం నుంచే ఈ స్థాయిలో హైప్ రావడంతో, రాబోయే రోజుల్లో సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానులకు పండుగలా మారే అవకాశం కనిపిస్తోంది.

Latest News