Nadiya | కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం.. అమెరికా వెళ్లడానికి కారణం అదే : నదియా
Nadiya | హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సహాయక పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నదియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Nadiya | హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సహాయక పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నదియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్‌కు అత్తగా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో హీరో తల్లిగా ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఒకప్పుడు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసిన నదియా, ఆ తర్వాత సడన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ విరామానికి గల అసలు కారణాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. మిర్చి సినిమాతో తిరిగి తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా, నిజంగా తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సినిమా మాత్రం అత్తారింటికి దారేదినే అని నదియా పేర్కొన్నారు.
త్రివిక్రమ్ తనను ఆ సినిమాలో అత్త పాత్ర కోసం సంప్రదించినప్పుడు, అలాంటి పాత్రలకే పరిమితం అయిపోతానేమో అన్న సందేహం తనకు కలిగిందని చెప్పారు. అయితే ఆ పాత్రలో ఉన్న బలమైన భావోద్వేగాలు, కథలోని ప్రాధాన్యతను దర్శకుడు వివరించడంతో చివరకు ఒప్పుకున్నానని తెలిపారు. కానీ ఆ పాత్ర అంతటి గుర్తింపును తెస్తుందని అప్పట్లో ఊహించలేదని నదియా అన్నారు.
పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రిత్యా అమెరికాకు వెళ్లాల్సి రావడంతో, తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని వెల్లడించారు. ఆ సమయంలో భర్త ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టి, అసోసియేట్ డిగ్రీ పూర్తి చేసి డీన్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించడం తన జీవితంలో గొప్ప సాధనగా భావిస్తున్నానని చెప్పారు.
సినిమాలు తనకు అభిరుచి మాత్రమేనని, కానీ కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యత అని నదియా స్పష్టం చేశారు. షూటింగ్ ఎంత ఆలస్యమైనా ఇంటికి త్వరగా చేరేందుకు ప్రయత్నిస్తానని, స్టార్‌డమ్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. నటనను కూడా తాను ఒక సాధారణ ఉద్యోగంలానే భావిస్తానని, కెరీర్ కన్నా వ్యక్తిగత జీవితం ఎంతో ముఖ్యమని నదియా చెప్పుకొచ్చారు. ఈ మాటలతో, గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి నిరూపించారు నదియా.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram