Nagabandham Teaser | భారీ విజువల్స్‌తో ‘నాగబంధం’ టీజర్ విడుదల .. శివతత్వం, ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌తో విరాట్ కర్ణ కొత్త ప్రయత్నం
Nagabandham Teaser | ‘పెదకాపు’ ఫేమ్ యువ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నాగబంధం పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. డివోషనల్ కంటెంట్, మిస్టరీ ఎలిమెంట్స్, అడ్వెంచర్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ నామ.
Nagabandham Teaser | ‘పెదకాపు’ ఫేమ్ యువ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నాగబంధం పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. డివోషనల్ కంటెంట్, మిస్టరీ ఎలిమెంట్స్, అడ్వెంచర్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ నామ. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ టీజర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, శివతత్వాన్ని ఆధునిక తరం కథనంతో మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘నాగబంధం’ టీజర్‌లో పురాతన రహస్యాలు, ట్రెజర్ హంట్, నాగబంధనం వంటి మిస్టిక్ కాన్సెప్ట్స్‌ను హైలైట్ చేశారు. ముఖ్యంగా శివుడి అవతారంలో విరాట్ కర్ణ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్షన్, అడ్వెంచర్, స్పిరిచువల్ ఎలిమెంట్స్ మిళితమైన ఈ టీజర్ సినిమా స్కేల్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుత తరం ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని శివతత్వాన్ని కొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో జగపతి బాబు, నభా నటేశ్, ఐశ్వర్యా మేనన్ నటిస్తున్నారు. వారి పాత్రలు కథకు బలమైన మద్దతు ఇస్తాయని చిత్రబృందం చెబుతోంది.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నాగబంధం’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో, ఉన్నత స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదల సమయానికి మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram