Nani | ‘స్వచ్ఛరథాలు’కు నాని మద్దతు… గ్రామాల పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్న పవన్ కళ్యాణ్

Nani |ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రామీణాభివృద్ధి దిశగా కీలక చర్యలు చేపడుతున్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రారంభించిన ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Nani |ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రామీణాభివృద్ధి దిశగా కీలక చర్యలు చేపడుతున్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రారంభించిన ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

“మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చెత్తను సక్రమంగా నిర్వహించడం, తడి–పొడి చెత్తను వేరు చేయడం, చెత్త నుంచి సంపద సృష్టి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు.

నాని రంగంలోకి..

ఈ కార్యక్రమంపై మరింత ప్రచారం కల్పించేందుకు టాలీవుడ్ హీరో నాని ను కూడా రంగంలోకి దింపారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు నాని వెంటనే స్పందించి, ‘స్వచ్ఛరథాలు’పై ఓ అవగాహన వీడియో రూపొందించారు.

ఆ వీడియోలో నాని మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన ‘స్వచ్ఛరథాలు’ చాలా మంచి కార్యక్రమం. మనం తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత” అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.

పెరుగుతున్న చైత‌న్యం..

నాని చెప్పిన సందేశం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా యువతలో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెరిగేలా ఈ వీడియో ప్రభావం చూపుతోంది.

ఇక ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు, చెత్త నిర్వహణపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్, గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి, ప్రభుత్వం–సెలబ్రిటీలు కలిసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Latest News