Pawan Kalyan Kondagattu visit| కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
విధాత : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan) తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి)Kondagattu visit)ని దర్శించుకున్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భూమిపూజ చేశారు. అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
కొండగట్టు అంజన్న స్వామికి పరమ భక్తుడైన పవన్ కల్యాణ్ తరుచు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో విద్యుద్ఘాతం ప్రమాదం నుంచి పవన్ బయటపడటాన్ని ఆయన కొండగట్టు అంజన్న కృపగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొండగట్టు అంజన్న పట్ల పవన్ తన భక్తిని చాటుతూ వస్తున్నారు. పవన్ కొండగట్టు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram