Nivetha Pethuraj | నిశ్చితార్థం రద్దు.. విరామం తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన నివేదా పేతురాజ్

Nivetha Pethuraj |b తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. గతంలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించిన నివేదా, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Nivetha Pethuraj |b తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. గతంలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించిన నివేదా, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిందని, 2026లో పెళ్లి ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది.

అయితే అనూహ్యంగా పరిస్థితులు మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రజిత్‌కు సంబంధించిన ఫోటోలన్నింటినీ తొలగించడం, అతడిని అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాలు ఈ రిలేషన్ ముగిసినట్టే అన్న సంకేతాలు ఇచ్చాయి. దీంతో ఈ జంట నిశ్చితార్థం రద్దయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొత్త జీవితం..

ఈ బ్రేకప్ తర్వాత కొంతకాలం విదేశాల్లో గడిపిన నివేదా, తిరిగి చెన్నైకి వచ్చి తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రేమ కోసం తన సినీ కెరీర్‌ను పక్కన పెట్టిన ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట నివేదా. గత మూడేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతలతో టచ్‌లోకి వస్తోందని సమాచారం.

సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుంది..

2017లో విడుదలైన ‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నివేదా పేతురాజ్, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘దాస్ క ధమ్కీ’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. నటనలో వైవిధ్యాన్ని చూపించిన ఆమెకు మాస్, క్లాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సరైన అవకాశాలు దొరికితే, మరోసారి ఆమె తన ప్రతిభను నిరూపించుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News