NTR | ఎన్టీఆర్ పార్టీ పెడితే అందులోకి వెళ్తాం.. ఆయ‌న సీఎం కావ‌డం ప‌క్కా.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

NTR | వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వైసీపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

  • By: Sandeep |    movies |    Published on : May 19, 2026 9:49 AM IST
NTR | ఎన్టీఆర్ పార్టీ పెడితే అందులోకి వెళ్తాం.. ఆయ‌న సీఎం కావ‌డం ప‌క్కా.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

NTR | వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వైసీపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి ‘ఫస్ట్ టైమ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతారా? అనే ప్రశ్నకు స్పందించిన దివ్వెల మాధురి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ప‌క్కా..

దువ్వాడ శ్రీనివాస్‌కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో అని మాధురి తెలిపారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ను ఇష్టపడేవారని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా అదే స్థాయిలో అభిమానిస్తారని పేర్కొన్నారు. ఆయన సినిమాలను క్రమం తప్పకుండా చూస్తారని కూడా వెల్లడించారు.

అంతేకాకుండా తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరహాలోనే, తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తాము కోరుకుంటున్నామని మాధురి తెలిపారు. యువత రాజకీయాల్లోకి వస్తే కొత్త మార్పులు తీసుకురాగలరని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆయ‌న పార్టీలో చేర‌తాము..

మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో రాణించే సామర్థ్యం, ప్రజలను ఆకర్షించే ఛరిష్మా ఉందన్నారు. తమిళనాడులో విజయ్ చాలా కాలం పాటు గ్రౌండ్ స్థాయిలో పనిచేసి రాజకీయాలకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్‌కు మంచి ప్రజాదరణ ఉందని దువ్వాడ అన్నారు. తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పార్టీ కోసం కష్టపడ్డారని గుర్తుచేశారు. ఆయన ఇప్పటివరకు రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా ప్రకటించలేదని, అయితే ఒకవేళ రాజకీయాల్లోకి అడుగుపెడితే అది పెద్ద మార్పులకు దారితీసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

“ఎన్టీఆర్ పార్టీ పెడితే మేము కూడా ఆయనతోనే ఉంటాం” అంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తుపై అప్పుడప్పుడు ఇలాంటి చర్చలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారుతోంది.