Peddi | ‘పెద్ది’పై భారీ అంచనాలు.. కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడిన టీమ్, ఫ్యాన్స్ ఆవేదన

Peddi | రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యం, క్రికెట్ ఎమోషన్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

  • By: Sandeep |    movies |    Published on : May 07, 2026 9:38 AM IST
Peddi | ‘పెద్ది’పై భారీ అంచనాలు.. కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడిన టీమ్, ఫ్యాన్స్ ఆవేదన ‘పెద్ది’లో పవర్‌ఫుల్ రెజ్లర్ అవతారంలో రామ్ చరణ్.. అభిమానుల్లో భారీ అంచనాలు

Peddi | రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యం, క్రికెట్ ఎమోషన్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై హైప్‌ను పెంచాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమా రిలీజ్‌కు ఇంకా కేవలం 28 రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ప్రమోషన్స్ విషయంలో చిత్రబృందం నెమ్మదిగా వ్యవహరిస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ రెడీ.. కానీ ప్రచారం ఎక్కడ?

సమాచారం ప్రకారం పెద్ది ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని, ఈ నెల మూడో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అయితే ఫ్యాన్స్ మాత్రం “కేవలం కౌంట్‌డౌన్ పోస్టర్లతో సరిపెట్టకూడదు.. ఇప్ప‌టి నుంచే అగ్రెసివ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలి” అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. సుస్మిత లాంచ్ చేసిన ‘పెద్ది’ వెహికల్‌, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లాతో చేసిన ఇంటర్వ్యూ తప్ప సినిమాను భారీగా హైప్ చేసే కార్యక్రమాలు ఇప్పటివరకు కనిపించలేదని వారు అంటున్నారు.

ఐపీఎల్ సీజన్‌ను ఉపయోగించుకోలేదా?

ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతుండటం విశేషం. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జోరుగా సాగుతున్న సమయంలో సినిమాను ప్రమోట్ చేయడానికి ఇదే సరైన సమయమని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆ అవకాశాన్ని టీమ్ సరిగా వినియోగించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

“ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రమోషనల్ ఈవెంట్స్, స్టేడియం యాక్టివిటీస్, స్పెషల్ వీడియోస్ ప్లాన్ చేసి ఉంటే సినిమాకు దేశవ్యాప్తంగా మరింత రీచ్ వచ్చేది” అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

రామ్ చరణ్ రంగంలోకి దిగాలంటున్న అభిమానులు

ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం.. ఇప్ప‌టి నుంచి రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిన సమయం వచ్చేసింది. చెన్నై, బెంగళూరు, ముంబై, కేరళ వంటి ప్రధాన నగరాల్లో గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.

పాన్ ఇండియా సినిమాలకు భారీ ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో గతంలో వచ్చిన పెద్ద సినిమాలు నిరూపించాయని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2 ప్రమోషన్స్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు.

‘పుష్ప 2’ తరహా హైప్ కావాలంటున్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విషయంలో చిత్రబృందం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో భారీ క్యాంపెయిన్లు, ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్స్, మీడియా ఇంటరాక్షన్స్, ట్రైలర్ లాంచ్‌లు సినిమాకు భారీ బజ్ తీసుకొచ్చాయని గుర్తుచేస్తున్నారు.

అదే విధంగా ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న పెద్దికి కూడా ఇప్పుడు ప్రచారం పెంచితే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధం

పెద్ది సినిమాపై సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ భావోద్వేగాలు, స్పోర్ట్స్ డ్రామా, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్‌, రామ్ చరణ్ ఇంటెన్స్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాయని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో.. సరైన ప్రమోషన్ చేస్తే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఒకటే.. రిలీజ్‌కు ముందు ‘పెద్ది’ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుతుందా లేదా అన్నదానిపైనే ఉంది.