Peddi | రికార్డులపై పెద్ది దండయాత్ర.. ట్రైలర్‌తో ఇంటర్నెట్ షేక్.. గంటల్లో కోట్ల వ్యూస్!
Peddi | ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమాపై విడుదలకు ముందే బలమైన బజ్ ఏర్పడింది.
Peddi | ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమాపై విడుదలకు ముందే బలమైన బజ్ ఏర్పడింది.
సోమవారం (మే 18) ముంబయిలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో సాయంత్రం 4:05 గంటలకు చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. రామ్ చరణ్ లుక్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
రికార్డ్ వ్యూస్..
ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఇప్పుడు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ వార్త రాసే సమయానికి తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌లో సుమారు 1.67 కోట్ల వ్యూస్ నమోదు చేసింది. విడుదలైన కేవలం 13 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ రావడం విశేషంగా మారింది. అదే సమయంలో ట్రైలర్‌కు 4 లక్షలకు పైగా లైక్స్ రావడం కూడా గమనార్హం.
ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి హిందీలో కూడా భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. హిందీ ట్రైలర్‌కు కేవలం 12 గంటల్లోనే 1.51 కోట్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ యూట్యూబ్ ఛానెల్స్‌లో ట్రైలర్ విడుదల కావడంతో మొత్తం వ్యూస్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడు విభిన్న పాత్రలలో..
ఈ చిత్రంలో రామ్ చరణ్ గ్రామీణ నేపథ్యంలో సాగే క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ముఖ్యంగా క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మూడు విభిన్న కోణాలతో కూడిన పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ భిన్నమైన పాత్ర డిజైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి ముందే ‘పెద్ది’ ట్రైలర్ ఇంటర్నెట్‌లో తన దండయాత్ర ప్రారంభించినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల రోజు ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందన్నదానిపై పడింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram