Peddi | అభిమానుల ఎదురు చూపుల‌కి ఫుల్‌స్టాప్.. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన ‘పెద్ది’

Peddi |మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు తన విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆతృత మరింత పెరిగింది.

  • By: Sandeep |    movies |    Published on : May 01, 2026 6:03 PM IST
Peddi | అభిమానుల ఎదురు చూపుల‌కి ఫుల్‌స్టాప్.. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన ‘పెద్ది’

Peddi |మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు తన విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆతృత మరింత పెరిగింది.

తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ముందుగా ప్రకటించిన తేదీ కంటే కాస్త ముందుగానే సినిమాను తీసుకువస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

స్పోర్ట్స్ డ్రామాగా..

ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలను కలగలిపి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ప్రముఖ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండగా, ఆ పాట షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.

జూన్ 4న వ‌స్తున్నాం..

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, “పెద్దిగాడు ప్రతి ఒక్కరి హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఈ పాత్రను మర్చిపోవడం అంత సులభం కాదు. ఏప్రిల్ 30న రాకపోవడానికి క్షమించండి. జూన్ 4న వస్తున్నాం… ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి. ఆ రోజున చరణ్‌పై నా ప్రేమ అంతా మీరు చూస్తారు” అని చెప్పారు.

ఇక ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్న సుకుమార్ మాట్లాడుతూ, “పెద్ది ఒక పెద్ద స్క్రిప్ట్. కమర్షియల్ అంశాలతో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న సినిమా. గ్రౌండ్ లెవెల్ ఎమోషన్స్‌ను మెయింటైన్ చేస్తూ డైలాగులు రాయడం సులభం కాదు… కానీ బుచ్చిబాబు అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ‘రయ్ రయ్’ సాంగ్‌లో చరణ్ ఎనర్జీ మామూలుగా లేదు. ఆయన కెరీర్‌లో ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూడలేదు” అని తెలిపారు.

అంతేకాకుండా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుండగా, హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, ఎన్నో అడ్డంకులను దాటుకుని జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పెద్ది’ సినిమా, మెగా అభిమానులకు పండగలా మారనుంది.