Peddi | రామ్‌చరణ్ ‘పెద్ది’పై మాస్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో… సంక్రాంతికి స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ!
Peddi |టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ ఇమేజ్, మార్కెట్ స్టామినా, పాన్ ఇండియా క్రేజ్ అన్నీ కలిపి చూసినా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పేరు టాప్‌లో వినిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
Peddi |టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ ఇమేజ్, మార్కెట్ స్టామినా, పాన్ ఇండియా క్రేజ్ అన్నీ కలిపి చూసినా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పేరు టాప్‌లో వినిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. అలాంటి టైమ్‌లో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే భారీ అంచనాలతో ముందుకు దూసుకుపోతోంది. ‘ఉప్పెన’తో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్న సానా బుచ్చిబాబు, ఈసారి మరింత పెద్ద స్కేల్‌లో కథను చెప్పేందుకు సిద్ధమయ్యాడు. గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ‘పెద్ది’ని ఒక ప్రత్యేక అనుభూతిగా మలచాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
భారీ బ్యానర్ – స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా ఉండటం సినిమాపై నమ్మకాన్ని పెంచింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయాలనే టార్గెట్‌తో ఉన్నారు.
రెండో పాటపై ఫోకస్
ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘చికిరి చికిరి’ మ్యూజిక్ చార్ట్‌లను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి రెండో సింగిల్‌పై పడింది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ పాటను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పక్కా మాస్ టచ్‌తో, రామ్‌చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సాంగ్‌ను తెరకెక్కించారట.
ఈ పాటలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో చరణ్ స్టెప్పులు వేయనున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, జాన్వీ కపూర్‌తో కలిసి ఆయన డ్యాన్స్ చేసే భాగం ప్రత్యేక హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. రెహమాన్ ఈ సాంగ్‌లో మాస్ బీట్‌లతో పాటు ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేశాడని మ్యూజిక్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
‘చికిరి చికిరి’ సక్సెస్ ఎఫెక్ట్
‘చికిరి చికిరి’ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. రామ్‌చరణ్ డ్యాన్స్, రెహమాన్ ట్యూన్ కలిసి రీల్స్, షార్ట్ వీడియోలకు ఫేవరెట్‌గా మారాయి. తెలుగు వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటడం, అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
వాయిదా రూమర్లపై సైలెన్స్
ఇటీవల ‘పెద్ది’ రిలీజ్ వాయిదా పడొచ్చన్న రూమర్లు వినిపించినా, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇండస్ట్రీ వర్గాల మాట ప్రకారం, ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ విషయంలో మాస్ ఆడియెన్స్‌తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. సంక్రాంతికి రాబోయే రెండో పాట ఈ హైప్‌ను ఇంకెంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram