Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్ విడుదల.. మాస్, భావోద్వేగాలు, యాక్షన్‌తో మరో భారీ విజయానికి రామ్ చరణ్ సిద్ధమా?

Peddi Trailer | గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

  • By: Sandeep |    movies |    Published on : May 18, 2026 4:28 PM IST
Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్ విడుదల.. మాస్, భావోద్వేగాలు, యాక్షన్‌తో మరో భారీ విజయానికి రామ్ చరణ్ సిద్ధమా?

Peddi Trailer | గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముంబైలో భారీ ఎత్తున ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు.

ఇందులో ఏముంది..

ట్రైలర్‌ను పరిశీలిస్తే ఇది కేవలం స్పోర్ట్స్ నేపథ్య కథ మాత్రమే కాకుండా, గ్రామీణ వాతావరణం, బలమైన భావోద్వేగాలు, మాస్ యాక్షన్ అంశాలతో నిండిన కథగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కొత్త రస్టిక్ లుక్, డైలాగ్ చెప్పే తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

1980ల గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో అక్కడి జీవన విధానం, మనుషుల మధ్య ఉండే బంధాలు, ఆవేశం, పంతాలు, పోరాటాలు ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కథను తనదైన శైలిలో మలిచినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.

అదిరిపోయే రెస్పాన్స్..

ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక బలం చేకూర్చింది. అలాగే శృతి హాస‌న్ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. మాస్ అంశాలు, భావోద్వేగాలు, భారీ విజువల్స్‌తో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.