Pooja Hegde | బుట్ట‌బొమ్మ ఆ కుర్రాడితో ప్రేమ‌లో ప‌డిందా.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్

Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమాల వల్ల కాదు, ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో. గత కొద్దిరోజులుగా పూజా ఓ యువ నటుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తుండటంతో, బాలీవుడ్ వర్గాల్లో ఆమె ప్రేమలో పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమాల వల్ల కాదు, ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో. గత కొద్దిరోజులుగా పూజా ఓ యువ నటుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తుండటంతో, బాలీవుడ్ వర్గాల్లో ఆమె ప్రేమలో పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ యువకుడు ఎవరా? అని అభిమానులు ఆరా తీస్తుండగా బయటికి వచ్చిన పేరు రోహన్ మెహ్రా. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే టాక్ బీటౌన్‌లో వినిపిస్తోంది. పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, రెస్టారెంట్లు, అవుటింగ్స్‌కు వెళ్లడం వంటి విషయాలు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఒక్క సినిమా చేయ‌క‌పోయిన‌..

ఇదే కాకుండా, పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రోహన్ మెహ్రా చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా ఈ వార్తలకు కారణమైంది. ఆ పోస్టును అభిమానులు వైరల్ చేస్తూ, వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని భావిస్తున్నారు. వీరి పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను కూడా ఫ్యాన్స్ వెతుకుతూ, రిలేషన్‌కు సంబంధించిన సంకేతాలను గమనించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, పూజా హెగ్డే – రోహన్ మెహ్రా ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే, కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

జంట బాగుంది…

ఇదిలా ఉంటే, పూజా అభిమానులు మాత్రం ఈ వార్తలపై మిక్స్‌డ్ రియాక్షన్ ఇస్తున్నారు. కొందరు “ఇద్దరూ కలిసి చాలా క్యూట్‌గా ఉన్నారు” అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుండగా, మరికొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేమని అంటున్నారు.

కెరీర్ విషయానికి వస్తే, ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డేకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వరుస ఫ్లాప్స్ కారణంగా ఆమె కెరీర్ కొంత మందగించింది. ప్రస్తుతం ‘జననాయగన్’ సినిమాతో పాటు హీరో దుల్కర్ సల్మాన్‌తో ఒక ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి. బాలీవుడ్‌లో మాత్రం ఈ భామ ఇంకా బిజీగా కొనసాగుతోంది. మరి ఈ ప్రేమ వార్తలు నిజమవుతాయా? లేక రూమర్స్‌గా మిగిలిపోతాయా? అన్నది తెలియాలంటే పూజా హెగ్డే స్పందన కోసం వేచి చూడాల్సిందే.

Latest News