Prabhas | ఇండియన్ సినిమాపై టాలీవుడ్ జెండా.. ఓర్మాక్స్ రిపోర్ట్‌లో తెలుగు హీరోల డామినేషన్, నంబర్-1గా ప్రభాస్

Prabhas | ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనే అభిప్రాయం బలంగా ఉండేది. హిందీ హీరోల క్రేజ్ దేశవ్యాప్తంగా కనిపించేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రాంతీయ సినిమాలు భాషల హద్దులను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ తన కంటెంట్, భారీ సినిమాలు, స్టార్ పవర్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Prabhas Birthday Feature – The Baahubali Hero Who Redefined Indian Cinema with Saaho, Salaar & Kalki

Prabhas | ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనే అభిప్రాయం బలంగా ఉండేది. హిందీ హీరోల క్రేజ్ దేశవ్యాప్తంగా కనిపించేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రాంతీయ సినిమాలు భాషల హద్దులను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ తన కంటెంట్, భారీ సినిమాలు, స్టార్ పవర్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

తాజాగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ – ఏప్రిల్ 2026’ నివేదిక ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికలో టాలీవుడ్ హీరోల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా టాప్-10 మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో తెలుగు హీరోలు సగానికి పైగా స్థానాలను దక్కించుకోవడం విశేషంగా మారింది.

టాప్‌లో ప్ర‌భాస్..

ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ప్ర‌భాస్ దక్కించుకున్నారు. ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. గత నాలుగేళ్లుగా ఆయన దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకున్న ప్రభాస్.. తర్వాత వచ్చిన సలార్, కల్కి 2898 AD వంటి సినిమాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే స్పిరిట్, ఫౌజి వంటి సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన పాన్ ఇండియా ఇమేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా విస్తరిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రెండో స్థానంలో షారూఖ్ ఖాన్..

ఇక టాప్-10 జాబితాను పరిశీలిస్తే రెండో స్థానంలో షారూఖ్ ఖాన్ నిలిచారు. మూడో స్థానాన్ని అల్లు అర్జున్ దక్కించుకున్నారు. పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఆయనకు ఏర్పడిన క్రేజ్ ఈ ర్యాంకింగ్‌లో కూడా ప్రతిబింబించింది.

నాలుగో స్థానంలో విజ‌య్ నిలవగా, ఐదో స్థానంలో మ‌హేష్ బాబు చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆరో స్థానంలో ర‌ణ్‌వీర్ సింగ్, ఏడో స్థానంలో రామ్ చ‌ర‌ణ్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

చివరి మూడు స్థానాల్లో స‌ల్మాన్ ఖాన్ ఎనిమిదో స్థానంలో, అక్ష‌య్ కుమార్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక పదో స్థానాన్ని ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తారక్ తన కొత్త ప్రాజెక్ట్ డ్రాగన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మొత్తంగా చూస్తే ఈ నివేదిక మరోసారి టాలీవుడ్ పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ ఆధిపత్యం కనిపించిన చోట ఇప్పుడు తెలుగు హీరోలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటూ ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపిస్తున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest News