Priyanka Chopra | నెట్‌ఫ్లిక్స్ కామెడీ షోలో ప్రియాంక చోప్రా సందడి.. ‘వారణాసి’ విశేషాలతో పాటు లవ్ స్టోరీ రివీల్
Priyanka Chopra | రాజమౌళి–మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’తో మరోసారి ఇండియన్ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ కామెడీ షోలో ప్రత్యేక అతిథిగా కనిపించబోతోంది.
Priyanka Chopra | రాజమౌళి–మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’తో మరోసారి ఇండియన్ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ కామెడీ షోలో ప్రత్యేక అతిథిగా కనిపించబోతోంది. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ పాపులర్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సీజన్ 4 డిసెంబర్ 20న ప్రారంభం కానుంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కే ప్రియాంక చోప్రాను గెస్ట్‌గా ఆహ్వానించడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 20న రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌ను సరదాగా పంచుకుంటూ కనిపించింది. తన భర్త నిక్ జోనస్‌తో పరిచయం పెరగడంలో ట్విట్టర్ కీలక పాత్ర పోషించిందని ప్రియాంక వెల్లడించగా, కపిల్ శర్మ వెంటనే “ట్విట్టర్ వల్ల మీకు జోడీ దొరికారు… నాకైతే కేసులు దొరికాయి” అంటూ వేసిన సెటైర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇక సునీల్ గ్రోవర్ తనదైన శైలిలో ప్రియాంకను ఉద్దేశించి “మార్కెట్లోకి ఎన్ని ల్యాప్‌టాప్‌లు వచ్చినా… PC (ప్రియాంక చోప్రా)లో ఉన్న కిక్ దేంట్లోనూ ఉండదు” అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేయడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. అలాగే “మీరు ఉదయం లేవగానే ప్రియాంక చోప్రాగా మారితే ఏం చేస్తారు?” అని ప్రియాంక అడిగిన ప్రశ్నకు, “వెంటనే కపిల్ శర్మకు ఫోన్ చేసి నువ్వే నా నిజమైన ప్రేమ అని చెప్తాను” అంటూ కపిల్ చేసిన ఫ్లర్టీ కామెంట్ మరోసారి నవ్వులు పూయించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్, ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ కథలో, వారణాసిని ఢీకొట్టబోయే గ్రహశకలం వల్ల ఏర్పడే ప్రళయాన్ని అడ్డుకునే రక్షకుడి ప్రయాణమే ప్రధానాంశం. కీరవాణి సంగీతం, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీతో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఏప్రిల్ 2027లో విడుదల కానుంది.
ఒకవైపు పాన్ ఇండియా, గ్లోబల్ స్థాయిలో భారీ సినిమాతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, మరోవైపు నెట్‌ఫ్లిక్స్ కామెడీ షోలో తన చమత్కారంతో ప్రేక్షకులను నవ్వించబోతోంది. దీంతో డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ ఎపిసోడ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Mastiverse mein Desi Girl ki entry hone waali hai 🤩❤️🔥 pic.twitter.com/h7T6TX9BMI
— Netflix India (@NetflixIndia) December 17, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram