Raja Sekhar | శ్రీలీల ఎనర్జీకి ఫిదా అయిన రాజశేఖర్.. స‌రదా ఒప్పందం గురించి రివీల్ చేసిన యాంగ్రీ మెన్

Raja Sekhar | టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న‌ డాక్టర్ రాజశేఖర్ తన ముక్కుసూటి మాటలతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, నేటి తరం సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసలు కురిపించారు.

Raja Sekhar | టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న‌ డాక్టర్ రాజశేఖర్ తన ముక్కుసూటి మాటలతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, నేటి తరం సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసలు కురిపించారు.

శ్రీలీల ఎనర్జీపై ప్రశంసలు

రాజశేఖర్ మాట్లాడుతూ, శ్రీలీల డ్యాన్స్‌లో చూపించే వేగం, ఎనర్జీ తనను ఎంతో ఆశ్చర్యపరిచిందన్నారు. నేటి తరం హీరోయిన్స్‌లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించిందని కొనియాడారు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఆమె ఎనర్జీ లెవల్స్ చూసి తాను ఇంప్రెస్ అయ్యానని తెలిపారు.

రాజశేఖర్, శ్రీలీల ఇద్దరూ వృత్తిరీత్యా వైద్యులు కావడం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక సరదా సంఘటనను ఆయన గుర్తుచేశారు. మనం కలిసినప్పుడు డాక్టర్ వృత్తి, మెడిసిన్ గురించి అసలు మాట్లాడకూడదు అని శ్రీలీల నవ్వుతూ చెప్పిందని, అలా తామిద్దరం ఒక సరదా ఒప్పందానికి వచ్చామని ఆయన చెప్పారు.

ఇండస్ట్రీలో తన పెద్ద కుమార్తె శివాని, అలాగే సాయి పల్లవి, శ్రీలీల వంటివారు వైద్య విద్యాభ్యాసం చేసినవారు కాగా, వారు సినీ ప‌రిశ్ర‌మ‌కి రావడం మంచి పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రొడక్షన్‌పై నిజాయితీగా స్పందన

సినిమా నిర్మాణం గురించి రాజశేఖర్ స్పష్టంగా మాట్లాడారు. గతంలో స్వయంగా సినిమాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయామని, అందుకే ప్రస్తుతం ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నామని చెప్పారు. అయితే మంచి కథ దొరికితే భవిష్యత్తులో మళ్లీ నిర్మాణం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

ఆస్ట్రేలియా షూటింగ్ అనుభవం

తన కెరీర్‌లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక విదేశీయుడు తన వయసు, అనుభవం తెలుసుకుని ఆశ్చర్యపోయాడని చెప్పారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు అభినందించాడని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న రాజశేఖర్, యువ నటీనటులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీలీల వంటి టాలెంటెడ్ నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆసక్తి వ్యక్తం చేశారు.

Latest News