Rakhi Sawant | తమిళ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న విజయ్ -త్రిష సంబంధంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించిందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం మరింత చర్చకు దారితీసింది.
నాకు చూడాలని ఉంది..
ఇప్పుడు ఇదే అంశంపై స్పందించిన రాఖీ సావంత్.. విజయ్, త్రిష ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని తనకు ఎంతో కోరికగా ఉందని చెప్పింది. అంతేకాదు వారి మెహందీ వేడుకలో తాను డాన్స్ కూడా చేస్తానని సరదాగా వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా త్రిషతో తనకున్న అనుబంధాన్ని కూడా రాఖీ గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ల నుంచే త్రిష తనకు తెలుసని, ఇద్దరం కలిసి ఎంతో కష్టపడ్డామని చెప్పింది. తర్వాత త్రిష సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపింది.
అలాగే విజయ్ గురించి కూడా రాఖీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కనీసం ఒక పాట అయినా చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు అయినా విజయ్-త్రిష మెహందీ ఫంక్షన్‌లో డాన్స్ చేసే ఛాన్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
త్రిష- విజయ్ రిలేషన్‌పై రూమర్స్..
విజయ్, త్రిష జంటకు తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’ వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘లియో’ సినిమాలో మళ్లీ జోడీగా కనిపించి అభిమానులను అలరించారు. అలాగే విజయ్ నటించిన ‘గోట్’ చిత్రంలో త్రిష ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లో కనిపించడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిషతో ఆయన సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ అంశాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి.
అదే సమయంలో విజయ్ భార్య సంగీతతో విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఒక సినీ నటితో విజయ్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విడాకుల వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాలపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఇటీవల చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కుటుంబ వివాహ వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఇక త్రిష పుట్టినరోజు రోజునే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రావడం కూడా ఆసక్తికరంగా మారింది. ఆ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు త్రిషకు శుభాకాంక్షలు చెబుతూ విజయ్ రాజకీయ విజయాన్ని పరోక్షంగా ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
