Vijay-Trisha | “విజయ్-త్రిష పెళ్లి చేసుకోవాలి”.. బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్స్ వైరల్!
Vijay-Trisha | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో వార్తల్లో నిలిచిన విజయ్ గురించి, హీరోయిన్ త్రిష తో వస్తున్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vijay-Trisha | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో వార్తల్లో నిలిచిన విజయ్ గురించి, హీరోయిన్ త్రిష తో వస్తున్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పార్టీ స్థాపించిన రెండేళ్లకే తమిళనాడు రాజకీయాల్లో భారీ ప్రభావం చూపిన విజయ్, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చుట్టూ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మెహందీ వేడుకకి వెళతాము..
గత కొంతకాలంగా విజయ్-త్రిష మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ పలు రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరి పాత వీడియోలు, ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.
ఫిల్మీ మంత్ర మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్, “నాకు తెలిసి విజయ్, త్రిష ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. వాళ్ల పెళ్లి జరిగితే మేమంతా మెహందీ వేడుకకు వెళ్తాం” అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, విజయ్ అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని కూడా తెలిపింది.
రాఖీ ప్రశంసలు..
విజయ్‌తో ఒక పాట చేయడం నా కల. కానీ ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు అయితే ఆయన రాజకీయ పార్టీలో చేరాలని కూడా అనిపిస్తోంది అంటూ రాఖీ నవ్వుతూ చెప్పింది. అలాగే త్రిష గురించి మాట్లాడుతూ, “నాకు త్రిష చాలా కాలంగా తెలుసు. మేమిద్దరం బాలీవుడ్‌లో దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. తర్వాత ఆమె దక్షిణాదికి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ అయింది” అని గుర్తు చేసుకుంది.
ఇక విజయ్ వ్యక్తిత్వంపై కూడా రాఖీ ప్రశంసలు కురిపించింది. “విజయ్ చాలా మంచి వ్యక్తి. అతని విజయం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రజలు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది” అని పేర్కొంది.
రాఖీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్-త్రిష అభిమానులు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తూ చర్చిస్తున్నారు. అయితే విజయ్, త్రిష మాత్రం ఇప్పటివరకు తమపై వస్తున్న రూమర్స్ గురించి ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే, విజయ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా మారగా.. త్రిష వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయినప్పటికీ వీరిద్దరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram